మహారాష్ట్ర వేదికగా సెప్టెంబర్ 1 (శుక్రవారం) నుంచి జాతీయ సాఫ్ట్‌బాల్ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి తెలంగాణ లక్సెట్టిపేట గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీకి చెందిన ఆరుగురు ప్లేయర్లు ఎంపికయ్యారు. జట్టులో శాలిని, భూమిక, స్ఫూర్తి, స్వాతి, స్నేహ, లక్ష్మి ఉన్నట్లు కళాశాల ప్రిన్సిపల్ లలితా తెలిపారు. ఇటీవల కాగజ్‌నగర్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ టోర్నీలో ఈ ప్లేయర్లు మంచి ప్రతిభ కనబర్చారని, అందుకే జాతీయ టోర్నీకి ఎంపికైనట్లు ఆమె తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa