రాష్ట్రంలో కౌలు రైతులకు రైతుభరోసా నిధులు నేడు విడుదల కానున్నాయి. తాడేపల్లిలోని తన కార్యాలయం నుంచి వర్చువల్‌గా జరిగే ఈ కార్యక్రమంలో బటన్ నొక్కి.. నిధుల్ని జమ చేయనున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి. సాంకేతిక కారణాలతో నిన్న జరగాల్సిన కార్యక్రమం.. నేటికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో.. 1,46,324 మంది కౌలు రైతులకు రూ.109.74 కోట్లు జమ చేయనుంది ప్రభుత్వం. దేశంలోనే తొలిసారిగా కౌలు రైతులతో పాటు దేవదాయ, అటవీ భూములను సాగు చేస్తున్న వాస్తవ సాగుదారులకు కూడా వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తోంది. పంట హక్కు సాగు పత్రాలు పొందిన వారిలో అర్హులైన.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులు, అలాగే.. దేవదాయ భూములను సాగు చేస్తున్న రైతులకు ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున సాయం పంపిణీ చేస్తోంది. 2023–24 సీజన్‌కు సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయం ఇది.