నీళ్లు ఎక్కువగా తాగితే బరువు తగ్గవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలా మంది బరువు తగ్గడానికి వాటర్ ఫాస్టింగ్ చేస్తారని పేర్కొన్నారు. అయితే నీరు అధికంగా తాగడం వల్ల ఇతర సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. శరీరంలో అధికంగా నీరు చేరడం వల్ల సోడియం లోపం ఏర్పడుతుందన్నారు. అధికంగా నీరు తీసుకునేటప్పుడు దానికి తగ్గట్లు శారీరక శ్రమ కూడా చేయాలన్నారు. పౌష్టికాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వల్ల అధిక బరువు సమస్య తగ్గుతుందన్నారు.