అనారోగ్య సమస్యలతో ఆత్మ హత్యాయత్నం చేసిన ఆటో డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. తెనాలి పట్టణ నాజరుపేటకు చెందిన ఆటో డ్రైవర్ గండికోట కిశోర్ (43) కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ నెల ఆగస్ట్ 27న గడ్డిమందు కొని తాగాడు. గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతూ గురువారం కిశోర్ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వన్ టౌన్ సీఐ కె. చంద్రశేఖర్ తెలిపారు.