పల్నాడు జిల్లాలోని వెల్దుర్తి మండలం గంగలకుంట గ్రామానికి చెందిన ఐదుగురు టీడీపీ కార్యకర్తలని ఈరోజు(శుక్రవారం)వేకువజామున పోలీసులు తీసుకెళ్లారు. ఇటీవల గొట్టిపాళ్ళలో వైసీపీ వర్గీయుల దాడిలో పలువురు టీడీపీ వర్గీయులు గాయపడిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ వర్గీయులకు గంగలకుంట గ్రామస్తులు ఆశ్రయం కల్పించారు. దీనితో వారికీ వీరికి సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో పోలీసులు విచారణ మొదలెట్టారు. గొట్టిపాళ్ళ ఘర్షణలో టీడీపీ వర్గియులపై 307 కేసులు నమోదు అయ్యాయి.