ఒక ప్రాంతంలో 1500 మంది జనాభా దాటి ఉంటే ఆ ప్రాంతంలో నూతనంగా పోలింగ్ బూత్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏలూరు కలెక్టర్ పిప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు.ఓటర్ల సవరణ ప్రక్రియలో భాగంగా క్లైమ్స్, అభ్యంతరాల స్వీకరణ సెప్టెంబరు నెలాఖరు వరకు జరుగుతుందని అక్టోబర్‌లో జాబితా ప్రకటన జరుగుతుందని, అప్పటి వరకు సవరణ జరుగుతుందన్నారు. సెప్టెంబర్ మొదటి వారం లోగా పోలింగ్ కేంద్రాల పునర్విభజన చేయాల న్నారు. ఈ లోపుగా తహసీల్దార్లు అన్ని పోలింగ్ స్టేషన్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి చెక్ జాబితా ఇవ్వాలన్నారు. భవనాల మార్పుగానీ, పేరు మార్పుగానీ ఏమైనా ఉంటే ప్రతిపాదించాలన్నారు. తొలగించిన ఓటర్లను మరొకసారి సరి చూసుకోవాలని ఈఆర్వోలకు, ఏఈఆర్వోలకు సూచించారు.