యానిమేటర్ల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. గురువారం తన కార్యాలయంలో యానిమేటర్లు పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందించారు. 2021 తర్వాత యానిమేటర్లుగా చేరిన వారికి గౌరవ వేతనం అందటం లేదని, యానిమేటర్లు అందరికి హెచ్ఆర్ పాలసీని వర్తింప చేయాలని యానిమేటర్లు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ని కోరారు.