టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు అరెస్ట్‌పై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయ్యన్న ప్రభుత్వంపై విమర్శలు చేస్తే అరెస్టు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించే, ప్రశ్నించే అయ్యన్నపై అక్రమ అరెస్టుతో కక్ష సాధిస్తున్నారన్నారు. ప్రభుత్వంపై అయ్యన్న విమర్శలే నేరమైతే.... మంత్రులు, వైసీపీ నేతలు రోజూ చేస్తున్న వ్యాఖ్యలకు వారిని జీవితాంతం జైల్లో పెట్టాలన్నారు. జగన్ చేస్తున్న తప్పులు, నేరాల్లో ఇలా పోలీసులు భాగస్వాములు అయితే ఆ అధికారులు తీవ్ర మూల్యం చెల్లిస్తారు అంటూ చంద్రబాబు హెచ్చరించారు.