బల్లికురవ మండలం బల్లికురవలో రైతులు, ప్రజలు శుక్రవారం ఆందోళనకు దిగి రోడ్డుపై బైఠాయించారు. వేలపాళ లేని విద్యుత్ కోతలతో సతమతమవుతున్నామని వారు వాపోయారు. ఆగస్టు ముగిసిన రాష్ట్రంలో విద్యుత్ కోతలు తప్పడం లేదంటూ పలువురు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపోతే కరెంటు లేక ఫైర్లు ఎండిపోతున్నాయని రైతులు వాపోయారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.