అనారోగ్య కారణంగా ఈజిప్ట్‌కు చెందిన బిలియనీర్ మొహమ్మద్ అల్ ఫయద్ (94) తుదిశ్వాస విడిచారు. ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో జన్మించిన మొహమ్మద్ మొదటగా ఫిజీ డ్రింక్స్ అమ్మకాలతో వ్యాపార రంగంలో అడుగు పెట్టారు. ఆ తర్వాత రియల్ ఏస్టేట్, షిప్పింగ్, భవన నిర్మాణ రంగాల్లో దూసుకెళ్లారు. వ్యాపార రంగంలో ఆయన చేసిన సేవలకు గాను ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం ‘లెజియన్ ఆఫ్ హానర్’ అతడికి వరించింది.