నేడు దివంగత నేత వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ఇడుపులపాయకు వచ్చిన షర్మిల... తండ్రి సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సమయంలో పార్టీ విలీనంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. వైఎస్సార్టీపీ పార్టీ విలీనంపై మాట్లాడేందుకు ఇది వేదిక కాదని తెలిపారు. 14 ఏళ్ళైనా ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ ఇంకాబ్రతికే ఉన్నారన్నారు. వైఎస్ అద్భుతమైన పధకాలు ద్వారా కోట్లమంది ప్రజల గుండెల్లో ఉన్నారని తెలిపారు. రైతు పక్షపాతిగా ఉండి విద్యుత్ బకాయిలను మాఫీచేసి, ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేసిన మహానేత అంటూ కొనియాడారు