బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు శనివారం 1,355వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్టాడుతూ.... అమరావతి రాజధానిపై గిట్టని వారు పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. అసత్య ప్రచారాలు చేస్తూ, ఆర్ -5జోన్ పేరుతో మాస్టర్‌ప్లాన్‌ను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిని మూడు ముక్కలు చేసి, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని అన్నారు. అమరావతి అభివృద్ధిని కొనసాగిస్తే రాష్ట్రానికి సిరులు కురిసేవన్నారు. రాష్ట్ర హైకోర్టు తీర్పును అమలు చేసి ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకోవాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa