ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) జాయింట్ ఆపరేషన్లో 15 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. బంగారం విలువ 9 కోట్ల విలువ చేస్తుందని అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని నైడా అటవీ ప్రాంతంలో DRI , BSF అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. అధికారుల రాకను పసిగట్టిన కేటుగాళ్లు 106 బంగారు బిస్కెట్లను ఓ గుంతలో దాచిపెట్టగా అధికారులు బయటకు తీసి స్వాధీనం చేసుకున్నారు.