తమిళనాడులో జరిగిన బీజేపీ నేత కుటుంబ హత్యపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై స్పందించారు. హత్యకు గురైన మోహన్‌రాజ్, అతడి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటన తనను ఎంతో బాధించిందని పేర్కొన్నారు. తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నిందితులను సత్వరమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.