అఫ్గానిస్థాన్‌లోని ఫైజాబాద్‌లో భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం 7:08 గంటలకు స్వల్పంగా భూమి కంపించిందని, రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రత నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది. ఫైజాబాద్‌కు 196 కి.మీ. దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే ఈ భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.