పుంగనూరు అంగళ్ళు ఘనటకు సంబంధించి నమోదైన కేసుల్లో అరెస్టై జైలులో ఉన్న టీడీపీ శ్రేణుల కుటుంబాలను ఆదివారం టీడీపీ తంబళ్ళపల్లె నియోజక వర్గ పరిశీలకుడు గురవారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాలతో పరామర్శకు వచ్చానన్నారు. ఎలాంటి భయాందోళనకు గురికావద్దన్నారు. అరెస్టులతో జైలులో ఉన్న వారి బైయిల్ కోసం పార్టీ తరపున లాయర్లు కృషి చేస్తున్నారన్నారు. అరాచక వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa