ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సొంత సొమ్ముతో రోడ్డు మరమ్మతులు చేసిన జనసైనికులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 04, 2023, 01:33 PM

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, కలిదిండి మండలంలో పెదలంక గ్రామంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు ఆదివారం స్వచ్ఛందంగా రహదారి మరమ్మతులు చేపట్టారు. పెదలంక బస్టాప్‌ సమీపంలో ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారిపై పెద్ద గోతులు పడి ఉండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో గ్రామంలో పవన్‌ కల్యాణ్‌ అభిమానులు చందాలు వేసుకుని స్వచ్ఛందంగా రోడ్డుపై ఉన్న గుంతల్లో కంకర వేసి పూడ్చారు. పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వేడుకల్లో భాగంగా ప్రజలకు ఉపయోగపడే రోడ్డును మరమ్మతులు చేసే కార్యక్రమం చేపట్టడం సంతృప్తినిచ్చిందన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa