స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 241 పాయింట్లు లాభపడి 65,628 వద్ద ముగిసింది. నిఫ్టీ 94 పాయింట్లు పెరిగి 19,529 వద్ద స్థిరపడింది. ఐటీ ఇండెక్స్ మార్కెట్లను నడిపించింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : విప్రో (4.34%), హెచ్సిఎల్ టెక్నాలజీస్ (3.98%), అల్ట్రాటెక్ సిమెంట్ (3.82%), టాటా స్టీల్ (3.62%), టెక్ మహీంద్రా (2.39%).
టాప్ లూజర్స్ : మహీంద్రా అండ్ మహీంద్రా (-0.97%), యాక్సిస్ బ్యాంక్ (-0.93%), ఐటీసీ (-0.84%), ఏషియన్ పెయింట్స్ (-0.76%), బజాజ్ ఫైనాన్స్ (-0.67%).