సనాతన ధర్మం వివాదంపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనవడు, వంచిత్ బహుజన్ ఆఘాడీ జాతీయ అధ్యక్షుడు ప్రకాశ్ అంబేడ్కర్ స్పందించారు. సనాతన ధర్మాన్ని 'అంటరానితనం'తో సమానమని సోమవారం పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన X(ట్విట్టర్)లో ‘సనాతన ధర్మం = అంటరానితనం’ అని ఇంగ్లీష్‌లో రాసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. ‘సనాతన ధర్మం అంటరానితనాన్ని నమ్ముతుంది. సనాతన ధర్మాన్ని ఎలా అంగీకరిస్తాం?’ అని ప్రశ్నించారు.