ఏపీ సీఎం జగన్ 102 ప్రాజెక్టులు రద్దు చేసి రాయలసీమ ద్రోహిగా మిగిలారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం పెట్టుబడి రాయితీ ఇస్తామని రైతులను మోసం చేసిందని విమర్శించారు. పంటల బీమా పథకాన్ని పాత పద్ధతిలోనే అమలు చేసి, రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ శాఖను మూసేసిందని, వెంటిలేటర్‌పై వ్యవసాయం చేస్తుందన్నారు.