ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో త్వరలో సమావేశమయ్యే అవకాశం ఉందని అమెరికాకు చెందిన జాతీయ భద్రత మండలి ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ తెలిపారు. ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్నందున రష్యా ఆయుధాలను సమీకరించాలనుకుంటోందని.. ఈ నేపథ్యంలోనే కిమ్ ఆ దేశంలో పర్యటించే అవకాశాలున్నాయని వెల్లడించారు.