సారవకోట మండలం ధర్మలక్ష్మి పురం సచివాలయపరిధి మహాసింగి గ్రామపంచాయతీలోని గాతలపేట, మొదిలి కొత్తూరు, సవరపేట గ్రామాల్లో మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతంగా జరిగింది. శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్, సీఈసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియ హాజరయ్యారు. గడప గడపలో దాసన్నకు అపూర్వ స్వాగతం లభించింది. ఇంటింటా నుదుట తిలకం దిద్ది, కర్పూర హారతులు సమర్పించి గ్రామాల్లోకి ఆహ్వానించారు.