తాజాగా అమెరికాలోని లూయిస్ పట్టణంలో ఓ ఆశ్చర్యకర నిర్ణయం జరిగింది. ఇదిలావుంటే హిందువులు విశ్వసించే సనాతన ధర్మాన్ని తూలనాడి తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ పెద్ద చర్చకు, వివాదానికి తావిచ్చారు. ఈ తరుణంలోనే అమెరికాలోని లూయిస్ విల్లే పట్టణం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 3వ తేదీని సనాతన ధర్మ దినంగా ప్రకటించింది. కెంటుకీ రాష్ట్రంలోని లూయిస్ విల్లే పట్టణ మేయర్ ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఏటా సెప్టెంబర్ 3న లూయిస్ విల్లే పట్టణంలో సనాతన ధర్మానికి మద్దతుగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మేయర్ క్రెయిగ్ గ్రీన్ బెర్గ్ తరఫున డిప్యూటీ మేయర్ బార్బనా సెక్స్ టన్ స్మిత్ దీనిపై అధికారికంగా ప్రకటన చేశారు. పట్టణంలోని హిందూ ఆలయంలో మహా కుంభాభిషేకం కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ మేయర్ ప్రకటన చదివి వినిపించారు. రిషికేశ్ లోని పరమార్థ్ నికేతన్ ప్రెసిడెంట్ చిదానంద సరస్వతి, శ్రీశ్రీ రవిశంకర్, భగవతి సరస్వతి, లెఫ్టినెంట్ గవర్నర్ జాక్వెలన్ కోల్ మ్యాన్, డిప్యూటీ చాఫ్ ఆఫ్ స్టాప్ కీష డోర్సే తదితరులు దీనికి హాజరయ్యారు.