ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిర్ కెనడా ఎయిర్‌లైన్స్ లో మహిళకు ధారుణ అనుభవం

international |  Suryaa Desk  | Published : Wed, Sep 06, 2023, 10:48 PM

ప్రయాణికులే దేవుళ్లగా రవాణ సంస్థలు భావిస్తాయి. కానీ ఎయిర్ కెనడా ఎయిర్‌లైన్స్ లో ఓ ఇద్దరు ప్రయాణికులకు తాజాగా దారుణ అనుభవం ఎదురైంది. వాంతితో తడిసిన సీట్లలో కూర్చోబోమన్నందుకు వారిని పైలట్ విమానం నుంచి దించేశారు. సియాటెల్ నుంచి మాంట్రియాల్‌కు వెళ్లే విమానంలో జరిగిన ఈ దారుణం గురించి మరో ప్రయాణికుడు బెన్సన్ ‘ఎక్స్’ సోషల్ మీడియా వేదికలో పంచుకున్నారు. ఆ సీట్ల నుంచి దుర్వాసన వచ్చిందని, అదేంటో మొదట తమకు అర్థం కాలేదని బెన్సన్ చెప్పారు. అంతకుముందు ఆ సీట్లలో కూర్చున్న వారెవరో వాంతి చేసుకుని ఉంటారని, దాన్ని కప్పిపుచ్చేందుకు సిబ్బంది చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదని తెలిపారు. సీట్లు తడిగా ఉండటంతో పాటు వాటి పక్కను వాంతి మరకలు ఉన్నాయని చెప్పారు. వాసన రాకుండా ఉండేందుకు సిబ్బంది అక్కడ సెంటుకొట్టారని ఆరోపించారు. 


ఆ సీట్లలో కూర్చోటానికి వీలులేకుండా ఉండటంతో ఆ ఇద్దరు ప్రయాణికులు తమకు వేరే సీట్లు కేటాయించాలని సిబ్బందిని కోరారు. తమ సమస్యను మర్యాదగానే చెప్పినా నిక్కచ్చిగా వ్యవహరించారని బెన్సన్ తెలిపారు. కానీ, ఈ విషయంలో తామేమీ చేయలేమని ఫ్లైట్ అటెండెంట్లు నిస్సహాయత వ్యక్తం చేశారు. మిగతా సీట్లలో ప్యాసెంజర్లు ఉన్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం మొదలు కావడంతో జోక్యం చేసుకున్న పైలట్ విమానం దిగిపోవాలని ఆ ఇద్దరినీ ఆదేశించాడు. లేకపోతే మరో విమానంలోనే ప్రయాణించేందుకు వీల్లేకుండా వారిని ‘నో ఫ్లై’ జాబితాలో చేర్చుతానని హెచ్చరించాడు. మరోదారి లేకపోవడంతో ఆ ఇద్దరు విమానం నుంచి దిగిపోయారని బెన్సన్ వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై సమీక్ష జరపుతున్నామని ఎయిర్ కెనడా స్పందించింది. నిబంధనల ఉల్లంఘన జరిగిందని అంగీకరించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com