హింసాత్మక ఘటనలతో అట్టుడికిన మణిపూర్లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కాస్త చక్కబడుతున్నాయి. కాగా ఆ ఘటనల్లో వేర్వేరు వర్గాల నుంచి స్వాధీనం చేసుకున్న అక్రమ ఆయుధాలపై నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు బుధవారం ఆ రాష్ట్ర సర్కారును ఆదేశించింది. అలాగే బాధితులకు పరిహారాన్ని పెంచేందుకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు సమర్పించా కోరింది. న్యాయమూర్తుల కమిటీ కోసం వెబ్సైట్ ఏర్పాటు ఎంతవరకు వచ్చిందో తెలపాలని ఆదేశించింది.