తిరుపతిలో భక్తుల సౌకర్యార్థం ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన శ్రీనివాస సేతు ప్రాజెక్టు చివరి దశకు చేరుకుంది. శ్రీనివాస సేతు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే చివరి స్ట్రెచ్‌ను ఈనెల 18న సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అలాగే అదే రోజు తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల తొలిరోజు సందర్భంగా తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.