జీ20 సదస్సుకు ఢిల్లీ ముస్తాబవుతోంది. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు అన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపడుతోంది. అయితే ఈ సదస్సు కోసం కేంద్రం రూ.4,100 కోట్ల అంచనా వ్యయం తెరపైకి వచ్చింది. ఢిల్లీ పోలీసులకు రూ.340 కోట్లు, ఎన్డీఎంసీ రూ.60 కోట్లు, పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ రూ.45 కోట్లు, ట్రాన్స్పోర్ట్ రూ.26 కోట్లు, డెవలప్మెంట్ అథారిటీకి రూ.18 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.