భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న జీ20 సదస్సుకు సర్వం సిద్ధమైంది. 19 దేశాలకు చెందిన అతిథుల రాక మొదలైంది. ఈ క్రమంతో అతిథులతో పాటు మాజీ ప్రధానులు, కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భారత ప్రభుత్వ కార్యదర్శలు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలకు శనివారం జీ20 విందుకు ఆహ్వానం అందింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గేకు ఆహ్వానం రాలేదు. ఈ విషయాన్ని ఖర్గే కార్యాలయం ధ్రువీకరించింది.