కొలంబోలో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ అక్తార్ ల్యాండ్ అయ్యారు. ఇదిలావుంటే ఆసియాకప్‌లో భాగంగా నేటి మధ్యాహ్నం మూడు గంటలకు భారత్-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ప్రపంచమంతా ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. గ్రూప్ దశలో ఈ రెండు జట్ల మధ్య పోటీ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసిపోవడంతో ఇప్పుడందరూ ఈ మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మ్యాచ్ జరగనున్న కొలంబోలో నేడు వర్షం పడే అవకాశం కూడా ఉంది. ఒకవేళ అదే జరిగితే రిజర్వు డే అయిన రేపు మ్యాచ్‌ను కొనసాగిస్తారు. ఈ మ్యాచ్ కోసం పాకిస్థాన్ లెజెండరీ పేసర్ షోయబ్ అక్తర్ కొలంబో చేరుకున్నాడు. వచ్చీ రావడమే ‘ఎక్స్’లో వీడియో పోస్టు చేశాడు. తాను కొలంబో చేరుకున్నానని, వాతావరణం బాగానే ఉందని పేర్కొన్నాడు. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఇక్కడ అడుగుపెట్టానని పేర్కొన్నాడు. గొప్ప దేశం, గొప్ప ప్రజలు అని కొనియాడాడు. అంతేకాదు, ‘‘పాకిస్థాన్‌తో జాగ్రత్త’’ అని ఓ హెచ్చరిక కూడా జారీ చేశాడు.