పాట్నాలో యూపీకి చెందిన సుభాష్ ప్రజాపతి అనే వ్యక్తి మృతి కేసును పోలీసులు చేధించారు. కుటుంబంలో గొడవల కారణంగానే.. అత్తామామలు, భార్య కలిసి సుభాష్ గొంతు నొక్కి హత్య చేశారని పోలీసులు పేర్కొన్నారు. అస్మెరీకి గతంలోనే రెండు వివాహాలు జరగ్గా.. మూడవసారి సుభాష్ను పెళ్లి చేసుకుంది. మృతుడు సుభాష్ సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం.. తన వదిన మరోక వ్యక్తితో నాలుగో వివాహం చేసుకోవాలని భావిస్తున్నదని తెలిపారు.