జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం దేశానికి వచ్చిన బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ ఆదివారం ఉదయం ఢిల్లీలోని ప్రఖ్యాత అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట సతీమణి అక్షతా మూర్తి కూడా ఉన్నారు. సుమారు 45 నిమిషాల పాటు అక్కడ గడిపిన సునాక్ దంపతులు ఆలయ విశిష్టతలు, శిల్పకళ, చరిత్రను అడిగి తెలుసుకున్నారు.