వైసీపీ కక్షపూరిత రాజకీయాలను నిరసిస్తూ సోమవారం, 11న రాష్ట్రవ్యాప్త బంద్కు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. చంద్రబాబు అరెస్టు, సీఎం జగన్ కక్షపూరిత రాజకీయాలకు నిరసనగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహించాని టీడీపీ తెలియజేసింది. బంద్ నిర్వహణకు మద్దతు ఇవ్వాలని ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులకు విజ్ఞప్తి చేసారు. వారంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని ప్రకటనలో పేర్కొన్నారు.