జగన్ ఓటమి భయంతోనే చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారని టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న అన్నారు. రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపు నేపథ్యంలో సోమవారం విజయవాడ వన్‌టౌన్‌లో షాపులను మూయించేందుకు వెళుతున్న ఆయనను అరెస్టు చేసి వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.....వైసీపీ నాయకులు తాత్కాలికంగా పైశాచికానందం పొందవచ్చేమోగానీ, తర్వాత తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.