లండన్ పర్యటన ముగించుకొని వచ్చిన సీఎం జగన్.. తన క్యాంపు ఆఫీసులో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, శాంతి భద్రతలపై చర్చిస్తున్నారు. ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సహా ఇతర అధికారులు పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో తాజా సమీక్ష ప్రాధాన్యతను సంతరించుకుంది.