విశాఖలోని రుషికొండపై సీఎం క్యాంపు కార్యాలయం పనులు శెరవేగంగా కొనసాగుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తిచేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవైపు భవన నిర్మాణాలను ఒక కొలిక్కి తీసుకువస్తూ...మరోవైపు రుషికొండ ప్రధాన మార్గం నుంచి కొండపైకి ఈ చివర నుంచి ఆ చివరికి తారురోడ్డు నిర్మిస్తున్నారు. సుమారు 40 అడుగుల వెడల్పున డబుల్ రోడ్డు వేస్తూ మధ్యలో డివైడర్ ఏర్పాటుచేస్తున్నారు. జీవీఎంసీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనే రుషికొండ పనులన్నీ జరుగుతున్నట్లు సమాచారం.