ఏపీ ప్రభుత్వం మంగళవారం మరో రూ.2 వేల కోట్లు అప్పు చేసింది. ఇందులో రూ.1,000 కోట్లను 7.48 శాతం వడ్డీతో 15 ఏళ్లలోగా, మరో రూ.1,000 కోట్లను 7.46 శాతం వడ్డీతో 18 ఏళ్లలోగా పూర్తిగా చెల్లించాలి. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదున్నర నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.61,500 కోట్లకు పైగా అప్పులు చేసింది. ఇందులో ఆర్‌బీఐ ద్వారా రూ.40,500 కోట్లు, కార్పొరేషన్లు, ఇతర మార్గాల ద్వారా రూ.21,000 కోట్ల పైచిలుకు రుణాలు తెచ్చారు.