నూజండ్ల మండలం కంభంపాడుకు చెందిన ఐదుగురు, వినుకొండకు చెందిన ఒకరు సోమవారం ఆటోలో నరసనాయునిపాలెంలో విగ్రహ ప్రతిష్ఠకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆటోను లారీ ఢీకొంది. ఆ ఘటనలో ఇప్పటికే యరబోతుల కోటేశ్వరమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. వారితో పాటు ఉన్న గోవిందమ్మకు పరిస్థితి విషమంగా ఉండటంతో నరసరావుపేటలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది.