తనను జైలుకు పంపించారనే జగన్, చంద్రబాబుపై కక్ష పెంచుకున్నారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. చంద్రబాబును అరెస్టు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుపై పెట్టిన సెక్షన్లు సరికాదని న్యాయ నిపుణులు చెప్పారన్నారు. చంద్రబాబుది అక్రమ అరెస్టు కాబట్టే జాతీయ స్థాయి నాయకులు స్పందించారని అన్నారు. సీఎం జగన్ తన కంపెనీల్లోకి డబ్బులు మళ్లించి పక్కా సాక్ష్యాలతో దొరికారని అన్నారు.