విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణకు సంబంధించి తొలగించబడిన ఓటర్ల జాబితా, ఇంటింటి వెరిఫికేషన్, ఎపిక్ కార్డుల ప్రింటింగ్, పంపిణీ తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లుతో సమీక్షించారు. రాజకీయ పార్టీల సమావేశంలో లేవనెత్తిన అంశాలపై తీసుకున్న చర్యలు పెండింగ్ లేకుండా సకాలంలో పూర్తిచేయాలన్నారు. ఈనెల 16న రాష్ట్ర స్థాయిలో మొదటి ఎఫ్‌ఎల్సీ నిర్వహణ వర్కుషాప్ ఉంటుందని జిల్లా కలెక్టర్లతో పాటు ఒక సీనియర్ సూపర్వైజరీ అధికారి హాజరు కావాల్సి ఉంటుందని సూచించారు. ఓటర్ల జాబితా పూర్తిస్థాయిలో పరిశీలించి ఈనెల 15 నాటికి పూర్తి చేస్తామన్నారు.పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ఫిజికల్ వెరిఫికేషన్ గడువులోపు పూర్తి చేస్తామన్నారు. ఇంటింటి సర్వేలో ఓటరుగా నమోదు కాని వారిగా గుర్తించి ఓటరు నమోదుకు చర్యలు చేపడుతున్నామన్నారు.