32 లక్షల కుటుంబాల కష్టార్జత్వాన్ని కొల్లగొట్టిన అగ్రిగోల్డ్ దొంగలను శిక్షించాలని, బాధితుల డిపాజిట్లు ఇప్పించండి అనే నినాదంతో ఈ నెల 15వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అగ్రిగోల్డ్ అసోసియేషన్ పిలుపునిచ్చారు. బుధవారం కందుకూరు సిపిఐ ఆఫీసులో విలేకరుల సమావేశంలో అగ్రిగోల్డ్ నాయకులు బోయపాటి శ్రీను మాట్లాడుతూ. సీఎం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇంకా మన చెవుల్లో ధనిస్తూనే ఉన్నాయని విమర్శించారు.