డేనియల్ సృష్టించిన వరదలతో లిబియా అల్లకల్లోలం అయింది. తూర్పు లిబియాలోని డెర్నా నగరంలో భారీ ప్రాణనష్టం చోటుచేసుకుంది. వాడిడెర్నా నదిపై ఉన్న రెండు డ్యామ్లు దెబ్బతినడంతో వరద ఉధృతికి అల్-బైదా, షహత్, సౌస్సే, బెంఘాజీ, అల్-మార్జ్ నగరాలు కోలుకోలేనంతగా దెబ్బతిన్నాయి. బుధవారం రాత్రి వరకు ఒక్క డెర్నా నగరంలోనే 5,600 మరణాలు నమోదయ్యాయని, మిగతా నగరాల్లో కలిపి మృతుల సంఖ్య 6,500 వేలు దాటిందని అధికారులు వెల్లడించారు.