వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర కేబినెట్ గుడ్న్యూస్ చెప్పింది. మరో దఫా మహిళలకు ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఈ వివరాలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఉజ్వల పథకం కింద ఇప్పటి వరకు 9.60 కోట్ల LPG సిలిండర్లు పంపిణీ చేశామన్నారు. ఈ విషయాన్ని ప్రకటించడం సంతోషంగా ఉందని.. మరో 75 లక్షల ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇస్తామని వెల్లడించారు.