తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష పోస్టర్ను వైయస్ఆర్సీపీ డాక్టర్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బత్తుల అశోక్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆదిమూలపు సతీష్, వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ స్పెషల్ ఆఫీసర్ యాదాల అశోక్ బాబు, తదితరులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి పేదవాడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే గొప్ప ఆశయంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సీఎం వైయస్ జగన్ తీసుకువచ్చారని తెలిపారు. ఈ నెల 15 వతేదీ నుంచి 30 వతేదీ వరకు అన్ని గ్రామ,వార్డు సచివాలయాల పరిధిలో వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ఆయా గృహాలలో ఆరోగ్యసేవలు గురించి ఆరాతీసి అవి అవసరమైన వారిని గుర్తిస్తారు. ఆ తర్వాత అక్టోబర్ 1 వ తేదీనుంచి 30 వతేదీ వరకు రాష్ట్రంలోని అన్ని సచివాలయాల పరిధిలో ప్రతి రోజూ 700 మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందన్నారు. వారికి 14 రకాల వైద్యసేవలు అందిస్తామని, 105 రకాల మందులను ఉచితంగా అందిస్తామని వివరించారు.