స్కిల్ డెవలప్మెంట్ అసలు స్కాం కాదని, ఏసీబీ కోర్టు తీర్పు దారుణం.. తీర్పు సరిగ్గా లేదని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వెనుక ఢిల్లీ హస్తం ఉందని, ఢిల్లీకి సంబంధం లేకుండా ఈ అరెస్టు జరగదన్నారు. చంద్రబాబు తప్పు చేసి ఉండరని చెప్పుకొచ్చారు. ఇలా అరెస్ట్ చేస్తే ముఖ్యమంత్రిగా ఎవరూ పనిచేయరన్నారు. సుప్రీం కోర్టులో చంద్రబాబుకు న్యాయం జరగడం ఖాయమని చింతా మోహన్ పేర్కొన్నారు.