హిమాచల్ ప్రదేశ్ లో కుండపోత వర్షాలు జల ప్రళయం సృష్టించిన విషయం విధితమే. దీనికి తోడు వరదలు పోటెత్తడంతో రాష్ట్రంలో రూ.వేల కోట్లల్లో నష్టం జరిగింది. దీంతో దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని జీ20 సమావేశాల సందర్భంగా కోరినప్పటికీ ప్రధాని మోదీ స్పందించడం లేదని తాజాగా ఆ రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సుఖు వ్యాఖ్యనించారు. జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఎన్ని సార్లు అడినప్పటికీ కేంద్ర సర్కారు స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.