పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి, ప్రకృతిని సహజంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డా. ఐ కరుణకుమార్ చెప్పారు. పర్యావరణ కాలుష్య నియంత్రణ, తగ్గించడం అంశంపై స్వచ్ఛంద సంస్థలు, వివిధ పరిశ్రమలు మహిళలు, పర్యావరణ కార్యదర్శులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చిత్తూరు నగరాన్ని సుందరంగా మారుస్తున్న కమిషనర్ జె అరుణకు అభినందనలు తెలిపారు.