స్కిల్ స్కాం కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ పిటిషన్పై న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. ఏబీసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించగా.. తమ వాదనలు కూడా వినాలని చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టును కోరారు. అటు కౌంటర్ దాఖలుకు సీఐడీ తరఫు న్యాయవాది సమయంకోరారు.