టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై నారా లోకేష్ జాతీయ మీడియాతో మాట్లాడాలనే ఉద్దేశంతో ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. చంద్రబాబు కేసు విషయంలో పలువురు సుప్రీంకోర్టు న్యాయవాదులతో లోకేష్ చర్చించనున్నారు. పార్లమెంటులో సైతం రాష్ట్ర పరిస్థితులు, కక్ష రాజకీయాలను చర్చించేలా టీడీపీ ప్లాన్ చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నారా లోకేష్ నిర్వహించనున్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై లోక్‌సభలో చర్చ కోసం పార్టీ ఎంపీలతో మాట్లాడనున్నారు.