సీఎం జగన్ పై ఏపీ కాంగ్రెస్ మీడియా విభాగ ఇంఛార్జ్ తులసిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేడు అయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు విషయంలో అవినీతిని కోర్టులు తెలుస్తాయి కానీ, చంద్రబాబును అరెస్టు చేసిన విధానం మాత్రం కరెక్ట్ కాదన్నారు. జగన్ సహజ ప్రవృత్తికి... అధికారం తోడు అయ్యిందన్నారు. ఫ్యాక్షనిస్టులకు అధికారం ఉంటే అన్నీ చలాయిస్తారన్నారు. అధికారం లేకుంటే వారంతా పిరికిపందలే... ఆయనది, నాదీ పులివెందులే... వాళ్లను ఎప్పటి నుంచో చూస్తున్నా అని తులసిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.