దుర్గి మోడల్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న మాచర్లకు చెందిన ఓ విద్యార్థి, దుర్గికి చెందిన 9వ తరగతి చదువుతున్న మరో విద్యార్థిని అదృశ్యమయ్యారు. శుక్రవారం యధావిధిగా పాఠశాలకు వెళ్లి ఆ తరువాత సాయంత్రమైనా ఇంటికి చేరకపోవడంతో తల్లిదండ్రులు దుర్గి పోలీసులను ఆశ్రయించారు. దీంతో దుర్గి పోలీసులు కారంపూడి సీఐ దార్ల జయకుమార్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.